
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లకు పలువురు అభ్యర్థులు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లకు మొత్తం 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లను సమర్పించారు. కాగా అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి మూడు డివిజన్ల అభ్యర్థులు నామినేషన్ వేశారు. కొండాపూర్ డివిజన్ నుంచి సెట్టింగ్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, గచ్చిబౌలి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, శేరిలింగంపల్లి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. వీరితో పాటు కొండాపూర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా బిజెపి గచ్చిబౌలి అభ్యర్థిగా గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి అభ్యర్థిగా ఎల్లేష్ లు నామినేషన్ దాఖలు చేయగా వీరి అభ్యర్థిత్వాన్ని బిజెపి ధృవీకరించాల్సి ఉంది. గచ్చిబౌలి డివిజన్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా రవీందర్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. గత ఎన్నికల్లో సైతం రవీందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా గచ్చిబౌలి డివిజన్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.