
శేరిలింగంపల్లి, నిఘా24 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కోసం అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు డివిజన్ల వారిగా ఓటరు జాబితాను విడుదల చేసారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్ల పరిధిలోని 7 డివిజన్ల ఓటరు జాబితాను సైతం అధికారులు విడుదల చేశారు. జంట సర్కిళ్ల పరిధిలో హఫీజ్ పేట డివిజన్ లో అత్యధికంగా, గచ్చిబౌలి డివిజన్ లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. మాదాపూర్, మియాపూర్, చందానగర్ డివిజన్లలో దాదాపు ఒకే స్థాయి లో ఓటర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు విడుదల చేసిన తాజా ఓటరు జాబితా ప్రకారం జంట సర్కిళ్ల పరిధిలోని 7 డివిజన్లలో ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి…
కొండాపూర్(104) డివిజన్
మొత్తం ఓటర్లు – 69,198
పురుషులు – 37,993
మహిళలు – 31,187
ఇతరులు – 18
పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 83
గచ్చిబౌలి(105) డివిజన్
మొత్తం ఓటర్లు – 50,439
పురుషులు – 26,873
మహిళలు – 23,552
ఇతరులు – 15
పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 80
శేరిలింగంపల్లి(106) డివిజన్
మొత్తం ఓటర్లు – 65,231
పురుషులు – 34,393
మహిళలు – 30,809
ఇతరులు – 29
పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 74
మాదాపూర్(107) డివిజన్
మొత్తం ఓటర్లు – 57,827
పురుషులు – 31,994
మహిళలు – 25,819
ఇతరులు – 14
పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 60
మియాపూర్(108) డివిజన్
మొత్తం ఓటర్లు – 57,822
పురుషులు – 30,892
మహిళలు – 26,910
ఇతరులు – 20
పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 55
హఫీజ్ పేట(109) డివిజన్
మొత్తం ఓటర్లు – 70,305
పురుషులు – 37,292
మహిళలు – 33,005
ఇతరులు – 08
పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 108
చందానగర్(110) డివిజన్
మొత్తం ఓటర్లు – 59,851
పురుషులు – 31,811
మహిళలు – 28,032
ఇతరులు – 08
పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 73