
హైదరాబాద్, నిఘా24 : ఇంటి ముందు పార్కు చేసిన కారు తీయమన్నందుకు ఓ కార్పొరేటర్ మహిళపై చెయ్యి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జీహెచ్ఎంసి కార్పొరేటర్ తన ఇంటి పక్కన ఉండే మహిళపై, ఆమె కుటుంబసభ్యుల ముందే దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసి శేరిలింగంపల్లికి చెందిన కార్పొరేటర్ నల్లగండ్లలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు. కాగా వీరి ఇంటి పక్కనే ఉంటున్న కుటుంబంతో సదరు కార్పొరేటర్ కు శనివారం రాత్రి వివాదం జరిగింది. తమ ఇంటికి ఎదురుగా పార్కు చేసిన కారును తీయమని అడిగినందుకు సదరు కార్పొరేటర్ ఆవేశంతో మహిళ పై దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారు. వీడియోలో కార్పొరేటర్ మహిళ మీద దాడి చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో శేరిలింగంపల్లితో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది.
bambola reale https://it.realsexdoll.com