
హైదరాబాద్, నిఘా24 : గత కొన్ని రోజుల క్రితం శేరిలింగంపల్లిలో చోటుచేసుకున్న వివాదంపై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు సోమవారం అధికార పార్టీ కార్పొరేటర్ ను అరెస్టు చేశారు. ఈ నెల 12వ తేదీన కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం నేపద్యంలో శేరిలింగంపల్లికి చెందిన కార్పొరేటర్ తమ ఇంటి పక్కన ఇంట్లో ఉండే యువతి మీద చెయ్యి చేసుకోవడం, దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాడి విషయమై బాధిత యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు అధికార పార్టీ కార్పొరేటర్ ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.