
హైదరాబాద్, నిఘా 24 : ప్రముఖ వంట నూనెల తయారీ సంస్థ కార్గిల్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కార్గిల్ సంస్థ తన జెమిని ప్యూర్ ఇట్ సన్ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు గురువారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్గిల్ ఫుడ్ ఇంగ్రీడియెంట్స్ దక్షిణాసియా బిజినెస్ లీడర్లు అవినాష్ త్రిపాఠి, సుబిన్ శివన్ లు జెమిని ప్యూర్ ఇట్ సన్ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో తమ బ్రాండ్లను విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణపట్నంలో 35 మిలియన్ డాలర్లతో 4.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ జెమిని బ్రాండ్ ఈ సంవత్సరం 40వ వార్షికోత్సవం జరుపుకుంటుందని, ఈ మధ్యే జెమిని సన్ ఫ్లవర్ ఆయిల్ ను నెంబర్ 1 నాణ్యత బ్రాండ్ గా కన్స్యూమర్ వాయిస్ గుర్తించిందన్నారు.
మరో వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో తీసుకువస్తున్న జెమిని సన్ ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ ప్యాకెట్ ను 175 రూపాయలు, బాటిల్ ను 180 రూపాయలు, 5లీటర్ల జార్ ను 900 రూపాయలు, 15 లీటర్ల జార్ ను 2425 రూపాయలుగా ధరను నిర్ణయించడం జరిగిందన్నారు.