
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గంజాయి సరఫరా రూపం మార్చుకుని కొత్త పంథాలో సాగుతుంది. గంజాయి సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో సరఫరాదారులు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. గంజాయిని చిన్నారులు తినే చాక్లెట్ ల రూపంలో మార్చి సరఫరా చేస్తున్నారు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు, అనుకున్న చోటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరవేసేందుకు అక్రమార్కులు ఈ దారిని ఎంచుకుంటున్నారు. తాజాగా నగరంలో పోలీసులు జరిపిన దాడిలో గంజాయి చాక్లెట్ లు బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. అచ్చం చాక్లెట్ ల మాదిరిగా ఉన్న ఈ గంజాయి చాక్లెట్ లలో కలిస్తే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. శనివారం
బాలానగర్ లో పోలీసులు జరిపిన దాడిలో 1500 గంజాయి చాక్లెట్ లు సీజ్ చేశారు. వీటిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.