
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ బిజెపి అభ్యర్థిగా గోపన్ పల్లికి చెందిన గంగాధర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. గచ్చిబౌలి డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్న గంగాధర్ రెడ్డి ఈ మధ్య బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం తన అనుచరులతో కలిసి బిజెపి గచ్చిబౌలి డివిజన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం పార్టీ బి ఫాం తో భారీ ర్యాలీగా మరోసారి నామినేషన్ వేస్తానని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నా అని, గచ్చిబౌలి డివిజన్ సమస్యలపై పూర్తి అవగాహన తనకు ఉందన్నారు. డివిజన్ లో ఉన్న బిజెపి నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోయి గ్రేటర్ ఎన్నికల్లో గచ్చిబౌలి గడ్డపై బీజేపీ జెండాను ఎగర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.