
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ప్రారంభ వేడుకలకు గచ్చిబౌలి డివిజన్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన ప్రజలతో కలిసి చందానగర్ పిజెఆర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఖాజాగూడలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని ఉద్దేశించి సాయిబాబా మాట్లాడుతూ సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17 అని తెలిపారు.

రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య భారతంలో తెలంగాణ కలిసి 75 ఏళ్లు అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను గచ్చిబౌలి డివిజన్లో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ అధ్యక్షుడు చెన్నంరాజు, వార్డు సభ్యులు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, దారుగుపల్లి నరేష్, నాయకులు వసంత్, నాగపురి అశోక్, శ్యామ్లెట్ శ్రీనివాస్, అక్బర్, అజీమ్, రమేష్ గౌడ్, గోవింద్, ఫయాజ్, సుగుణ, బాలమణి, నారాయణ, మధు, పరమేష్, నరేష్, నాగేష్, కుమారిలతోపాటు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
