
హైదరాబాద్, నిఘా24 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ మద్యలో ఉన్న టీఎన్జీఓ కాలనిలో ఇళ్ల స్థలాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై నిఘా24 వెలువరించిన కథనానికి అధికారులు స్పందించారు. నిఘా24 కథనం అనంతరం టీఎన్జీఓ కాలనిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టిన అధికారులు మంగళవారం సదరు నిర్మాణాలను కూల్చివేశారు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆగస్టు 8వ తేదీన నిఘా24 ‘ప్రభుత్వ అధికారుల అక్రమ కట్టడాలు’ పేరుతో కథనం వెలువరించిన విషయం తెలిసిందే. సామాన్యులకు ఒక రూల్ – ప్రభుత్వ అధికారులకు ఒక రూల్ అంటూ నిఘా24 ప్రశ్నించడంతో విచారణ చేపట్టిన జీహెచ్ఏంసి అధికారులు ఇప్పటి వరకు 17 అక్రమ నిర్మాణాలను గుర్తించి మంగళవారం కూల్చివేశారు. టీఎన్జీఓ కాలనీలో కేవలం జి+2కు మాత్రమే అనుమతి ఉందని, నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన అన్ని నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు తెలిపారు.


poupée de sexe réaliste https://fr.sexdollsoff.com