
హైదరాబాద్, నిఘా 24: తెలంగాణ రాష్ట్రంలో స్విమ్మర్లతో పాటు మాస్టర్ స్విమ్మర్లకు మరింత ప్రోత్సాహం అందచేయనున్నట్లు గచ్చిబౌలి స్విమ్మింగ్ ఆసోసియేషన్ సెక్రటరీ కొండ విజయ్ కుమార్ తెలిపారు. హర్యానా రాష్ట్రంలోని అంబలాలో నవంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలకు ఏంపికైన గచ్చిబౌలి స్టేడియం మాస్టర్స్ స్విమ్మర్లను కొండా విజయ్ అభినందించారు. సోమవారం గచ్చిబౌలి స్విమ్మింగ్ కాంప్లెక్సు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబాలా టోర్నమెంటుకు ఎంపికైన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన ఏంపిక పోటీల్లో అంబాలా టోర్నమెంటుకు గచ్చిబౌలి స్టేడియం స్విమ్మర్లు 15మంది ఎంపికయ్యారని తెలిపారు.

ఎంపికైన క్రీడాకారులు టోర్నమెంటులో ఉత్తమంగా రాణించాలని అభిలాషించారు. జాతీయ స్థాయి పోటీల్లో గతంలో ఎంతోమంది గచ్చిబౌలి స్విమ్మర్లు ఉత్తమంగా రాణించారని, అంబాలా టోర్నమెంటులో సైతం గచ్చిబౌలి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని అన్నారు. ఈ సందర్బంగా ఏంపికైన స్విమ్మర్లను ఆభినందించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ గోకుల్ యాదవ్, సమంత రెడ్డి, కోచ్ లు ఆయూష్ యాదవ్, తిరుపతి రెడ్డి, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.