
హైదరాబాద్, నిఘా24: అది ఒక ప్రార్థనా స్థలానికి చెందిన స్థలం. అందునా ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ లో ఉంది. గతంలో చేపట్టిన రహదారి కారణంగా ప్రార్ధనా మందిరం రోడ్డుకు ఒకవైపు ఉండిపోగా, ఈ ఖాళీ స్థలం మరోవైపు మిగిలింది. నిన్న,మొన్నటి వరకు స్థానికులు ఎవరైనా ప్రార్ధనా మందిరం వద్ద ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే రోడ్డుకు మరోవైపు ఉన్న ఈ ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకునేవారు. ప్రస్తుతం సదరు స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఔటర్ రింగురోడ్డు ప్రవేశద్వారం వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కోసం ఈ ఖాళీ స్థలం అవశ్యకం. ప్రార్ధనా స్థలానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం అనుబందంగా ఉన్న ఖాళీ స్థలాన్ని తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్థలానికి అనుకొని ఉన్న విశ్వాసాలతో ముడిపడి ఉన్న వాటిని సైతం ముట్టుకోలేదు. మొత్తం 224 గజాల ఖాళీ స్థలం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 91 ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రార్ధనా మందిరం స్థలం కావడంతో నష్ట పరిహారం ప్రార్ధనా మందిరం పేరు మీద రావాలి. లేదా ఆ వర్గం సంక్షేమం కోసం మరోచోట స్థలం కేటాయించాలి. కానీ ఓ కార్పొరేటర్ రంగప్రవేశంతో సీను మొత్తం మారిపోయింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న.. ప్రార్ధనా మందిరానికి చెందిన.. ఖాళీ స్థలానికి.. ప్రైవేట్ వ్యక్తులకు నష్ట పరిహారం చెక్కు వెళ్ళింది. గచ్చిబౌలిలో మార్కెట్ విలువ 30వేలు ఉండగా, దానికి రెండింతల లెక్కన 224 గజాలకు 1కోటి 34 లక్షల పరిహారం చెక్కును ప్రైవేట్ వ్యక్తులకు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ఓసి కోసం ఫైల్ పంపించినా, అక్కడి నుంచి అనుమతి రాకముందే ప్రజాప్రతినిధి చక్రం తిప్పడంతో పరిహారం చెక్కు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఇందులోనూ మరో విశేషం ఉంది. ఫ్లై ఓవర్ నిర్మాణం అనంతరం దానికింద తిరిగి వారి కార్యక్రమాలు నిర్వహించుకునే అంగీకారంతో పరిహారం ఇచ్చారు. స్థానిక ఆ వర్గం ప్రజలకు నష్ట పరిహారం విషయం తెలియకుండా జాగ్రత్త పడిన కార్పొరేటర్, ఫ్లై ఓవర్ నిర్మాణం అనంతరం కిందనున్న స్థలాన్ని ఉపయోగించుకుందామని నమ్మించాడు. ఇంకేముంది.. నష్ట పరిహారం 1.34కోట్ల రూపాయలు కొందరి జేబుల్లోకి వెళ్ళింది. ఈ స్థలానికి దగ్గరలో ఉన్న బ్యాంకులోనే చెక్కును క్యాష్ చేసుకోవడం జరిగిపోయింది. ప్రార్ధనా మందిరం సొమ్ము దాని అభివృద్ధికి గానీ, సదరు వర్గం సంక్షేమానికి గానీ ఉపయోగించకుండా కొందరి జేబుల్లోకి వెళ్లడం విశేషం. ఇదేనేమో రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటే..!

リアルなセックス人形