
హైదరాబాద్, నిఘా24: గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు ప్రధాన కూడలి నుంచి నానకరామగుడ సర్కిల్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లో బుధవారం మధ్యాహ్నం పెనుప్రమాదం తప్పింది. రహదారి విస్తరణ కోసం నిర్లక్ష్యంగా బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు ఎగిరి రహదారి మీద పడ్డాయి. ఇందులో ఓ కారుకు బండరాయి తగులగా, స్వల్పంగా దెబ్బతింది. భారీ బండరాళ్లు రహదారి మీద పడగా, సమయానికి వాహనాల రద్దీ ఎక్కువగా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.