
శేరిలింగంపల్లి, నిఘా 24: గచ్చిబౌలి పోలీసు స్టేషన్ ఇనిస్పెక్టర్ గా బి.జేమ్స్ బాబు నియమితులయ్యారు. మేడ్చల్ జోన్ ఎస్ఓటీ ఇనిస్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జేమ్స్ బాబు తాజాగా నిర్వహించిన బదిలీల్లో గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా పనిచేసిన గోన సురేష్ మేడ్చల్ జోన్ ఎస్ఓటీ ఇనిస్పెక్టర్ గా బదిలీపై వెళ్లారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8మంది ఇనిస్పెక్టర్ లను బదిలీ చేస్తూ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

కేపిహెచ్బీ పోలీసు స్టేషన్ డిఐ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ ను అదే స్టేషన్ ఇనిస్పెక్టర్ గా నియమితులయ్యారు. అల్వాల్ ఇనిస్పెక్టర్ గా అమన్గల్ లో పనిచేస్తున్న ఉపేందర్ రావును, ఇక్కడ పనిచేస్తున్న గంగాదర్ ను సిపిఓకు, చందానగర్ డిఐగా పనిచేస్తున్న క్యాష్ట్రో ను అదే పోలీసు స్టేషన్ ఇనిస్పెక్టర్ గా, సైబర్ క్రైమ్స్ లో పనిచేస్తున్న నరేందర్ ను మాదాపూర్ ఎస్బి ఇనిస్పెక్టర్ గా బదిలీ చేశారు.