
శేరిలింగంపల్లి, నిఘా 24: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరేకపూడి గాంధీని గెలిపించాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా డివిజన్ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమవారం డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి సోఫా కాలనీ, గోపన్ పల్లి తండాల్లో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో గత 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే గాంధీ నియోజకవర్గ అభివృద్ధి కోసం 9వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అభివృద్ధి పనులతో శేరిలింగంపల్లి రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గాంధీలకు దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పట్టించుకోకుండా ఉన్న గోపన్ పల్లిలో నేడు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి, అరేకపూడి గాంధీని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజునాయక్, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజుముదిరాజ్, సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజ్, బూత్ కమిటీ సభ్యులు, బూత్ ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.