
హైదరాబాద్, నిఘా24: నగరంలోని హైటెక్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లినరీ సభకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా విచ్చేసిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్లినరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు విచ్చేయగా, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రత్యేక తరహాలో విచ్చేశారు.

డివిజన్ టిఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి సాయిబాబా గుర్రపు స్వారీతో, గుర్రాల మీద విచ్చేయడం హైలెట్ గా మారింది. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ నుంచి సభా వేదిక హైటెక్స్ వరకు గచ్చిబౌలి ప్రతినిధులతో కలిసి సాయిబాబా గుర్రాలపై స్వారీ చేస్తూ, టిఆర్ఎస్ జెండాలు చేతబట్టి ర్యాలీగా తరలివచ్చారు. సాయిబాబా తో పాటు డివిజన్ జంగయ్య యాదవ్, రాజునాయక్, రమేష్ గౌడ్, అనిల్ సింగ్, భిక్షపతి, నరేష్ తదితరులు ఉన్నారు.
