
శేరిలింగంపల్లి, నిఘా 24: చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయిబాబా ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రంజిత్ రెడ్డి నివాసానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డికి మాజీ కార్పొరేటర్ సాయిబాబా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా శాలువాతో సన్మానించి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య రంజిత్ రెడ్డితో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి సహకారంతో గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ఎంపీ రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో గచ్చిబౌలి డివిజన్ వార్డు సభ్యులు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, దారుగుపల్లి నరేష్, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజు ముదిరాజ్, నాయకులు రమేష్ గౌడ్, నారాయణ,పురిడి కృష్ణ, శామ్లెట్ శ్రీనివాస్, నాగపూరి అశోక్ యాదవ్, ఫయాజ్, మధు, ఖాదర్ ఖాన్, అలీం, నరేష్, వెంకటేష్ ముదిరాజ్, సుగుణ, మాధవి తదితరులు ఉన్నారు.