
గచ్చిబౌలి, నిఘా 24: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఖాజాగుడ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్, ఖాజాగుడ పాఠశాల పూర్వ విద్యార్థి కొమిరిశెట్టి సాయిబాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేయడంతో పాటు ఉపాద్యాయులను సన్మానించారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యని ఇష్టంగా చదవాలని కష్టంగా కాదన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీని అందిపుచ్చుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధన కోసం కష్టపడి చదవాలని అన్నారు.

జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని కన్న తల్లిదండ్రులకు, చదువు చెప్పిన ఉపాద్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయులు నరహరి, ప్రమోద్ కుమార్, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామల, గెస్ట్ ఫ్యాకల్టీ మనీ మాధురి, గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, శంకరి రాజు ముదిరాజ్, రమేష్ గౌడ్, భిక్షపతి యాదవ్, వెంకటేష్, ఎస్.పద్మ తదితరులు పాల్గొన్నారు.