
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా శుక్రవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం వార్డు కార్యాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అంతకుముందు రాయదుర్గం పురాతన దేవాలయంలో పూజలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి జీహెచ్ఎంసీ ఎన్నిక లో పట్టం కడతారని అన్నారు. సాయిబాబా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గచ్చిబౌలి డివిజన్ లో తాము చేసిన అభివృద్దే రానున్న ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని, బంగారు తెలంగాణ సాధన కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే సాధ్యమని భావిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గచ్చిబౌలి డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
