
శేరిలింగంపల్లి, నిఘా 24: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను శనివారం గచ్చిబౌలిలో ఘనంగా సన్మానించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు మల్లికార్జున శర్మ, మేకల అశోక్, రాజు ముదిరాజ్, దివంగత శీతల్ సింగ్ సతీమణి మున్నిభాయ్ లను సత్కరించారు. గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో గల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈనెల 27న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి డివిజన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారుల సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమకారుల పోరాట ఫలితమే నేటి బంగారు తెలంగాణ అని పేర్కొన్నారు. ఉద్యమకారులతో కలిసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శేరిలింగంపల్లిలో తాను చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, నరేష్, జగదీష్, శ్రీనివాస్, నాగపురి అశోక్, రమేష్ గౌడ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.