
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రేస్ పార్టీ నాయకుడు కొండా రవిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా తన నామినేషన్ ను సమర్పించారు. కొండా రవిగౌడ్ గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, గచ్చిబౌలి డివిజన్ స్థితిగతులపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. రానున్న రోజుల్లో డివిజన్ ప్రజల ముందుకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, గచ్చిబౌలి డివిజన్ లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.