
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ అభ్యర్థిత్వం కోసం 35 నామినేషన్ దాఖలయ్యాయి. శేరిలింగంపల్లి సర్కిల్ లోనే గచ్చిబౌలి డివిజన్ కోసం అత్యధిక నామినేషన్లు నమోదయ్యాయి. మొత్తం 22 మంది అభ్యర్థులు 35 నామినేషన్లు వేశారు. ఇందులో లో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టిడిపి వంటి ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఉన్నారు. కాగా ఈ డివిజన్ లో బిజెపి ఆశావహ అభ్యర్థులు అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఏకంగా 15 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. గచ్చిబౌలి డివిజన్ కు నామినేషన్ వేసిన వారిలో కె సాయిబాబా, రవీందర్ రెడ్డి, రావులకొల్లు శ్రీకాంత్, నీరుడి సురేష్, నీలం నరేందర్ కుమార్, నక్క నరేంద్ర గౌడ్, వెంకటేష్ గౌడ్, గణేష్ గౌడ్, రవీంద్ర ప్రసాద్, చంద్రమౌళి, స్వామి గౌడ్, గంగాధర్ రెడ్డి, బాలకృష్ణమూర్తి, ఎన్. గణేష్, మూల అనిల్ గౌడ్ తదితరులు ఉన్నారు.