
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా, నల్లగండ్ల త్రిశూల సాఫ్రాన్ ఎలైట్ అపార్ట్మెంట్, నల్లగండ్ల హుడా కాలనీలో నల్లగండ్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపయ్యలకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పూజలు చేశారు. నల్లగండ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ లతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. మండపం నిర్వాహకులు గంగాధర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, రవికుమార్ యాదవ్ లను ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం డివిజన్ ప్రజలపై తప్పక ఉంటుందన్నారు .అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను మట్టి విగ్రహాల తోనే నిర్వహించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. విఘ్నేశ్వరునికి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ గోపనపల్లి వడ్డెర సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్ నాయకులు ప్రకాష్, నర్సింగ్ నాయక్, రంగస్వామి, వెంకటేష్,శంకర్, శ్రీ హరి , గోవర్ధన్ లతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు,భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Dear immortals, I need some wow gold inspiration to create.