
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తో కలిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు నిర్వహించిన వినాయకుడి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.

అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరునికి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను మట్టి విగ్రహాల తోనే జరుపుకుని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనీల్ కుమార్ యాదవ్, రంగస్వామి, రమేష్, సీనియర్ బిజెపి నాయకులు, గణేష్ కమిటీ సభ్యులు, గోపనపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.