
గచ్చిబౌలి, నిఘా 24: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని బుధవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో స్థానికులకు ఆధార్ సేవలు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ఈ ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ కార్డుకి సంబంధించిన అన్ని సేవలూ పొందవచ్చునని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఆధార్ సేవా కేంద్ర ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్థానికులుకు సూచించారు. మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచించారు.

కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించి, వారి మన్ననలు పొందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో యువత స్వయం ఉపాధి చూసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింగ్ నాయక్,మల్లేష్,ఆధార్ సేవా కేంద్ర సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.