
శేరిలింగంపల్లి, నిఘా 24 : తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ ఇంచార్జి దివంగత కొండకల్ శంకర్ గౌడ్ కు గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత శంకర్ గౌడ్ 9వ వర్దంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసిన సాయిబాబా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో టిఆర్ఎస్ పార్టీని గల్లిస్థాయి నుంచి బలోపేతం చేసిన వారిలో శంకర్ గౌడ్ ముఖ్యులని, రాజకీయాల్లో శంకర్ గౌడ్ తనకు గురువుతో సమానమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని శేరిలింగంపల్లిలోని వాడవాడలకు తీసుకువెళ్లిన శంకర్ గౌడ్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారని అన్నారు. ఐటీ కారిడార్ కు ఇబ్బందులు కలుగకుండా, పూర్తి శాంతియుతంగా, నెలల పాటు నిరాహారదీక్షలు చేసి స్థానికుల్లో ఉద్యమ కాంక్షను రగిలించిన ఘనత శంకర్ గౌడ్ కు దక్కుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ మరికొన్ని రోజుల్లో సాకారమయ్యే సమయంలో, ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకుండానే అనారోగ్యంతో శంకర్ గౌడ్ మృతిచెందడం బాధాకరమన్నారు.

ఉద్యమ సమయంలో శంకర్ గౌడ్ తో కలిసి చేసిన పోరాటాలను సాయిబాబా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నంరాజు, వార్డు సభ్యులు సతీష్ ముదిరాజ్, దారుగుపల్లి నరేష్, ఏరియా కమిటీ సభ్యుడు శంకరి రాజు ముదిరాజ్, నాయకులు నాగపూరి అశోక్, జగదీశ్, రమేష్ గౌడ్, అక్బర్, నారాయణ, శ్రీనివాస్, భిక్షపతి, ఫయాజ్, హాసన్, ఖాదర్ ఖాన్, తాహీర్, అరుణ, రాణి, బాలమణి, మాధవి, లత,సుగుణ, తదితరులు పాల్గొన్నారు.