
శేరిలింగంపల్లి, నిఘా24: జిహెచ్ఎంసి ఎన్నికల్లో గచ్చిబౌలి గడ్డపై బిజెపి జెండా ఎగురవేయడం ఖాయమని గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి వి. గంగాధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. డివిజన్ బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపడుతూ రానున్న ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.

ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైందన్నారు. డివిజన్లో నేటికీ మౌలిక వసతులకు నోచుకోని కేశవనగర్ వంటి బస్తీలు ఉన్నాయని, డివిజన్ సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బిజెపి, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయ డంఖా మోగిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు గోపన్ పల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన వారిని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే మారబోయిన బిక్షపతి యాదవ్ బిజెపి కండువాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
