
శేరిలింగంపల్లి, నిఘా24: టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ప్రచార ఆర్భాటాలు ఎక్కువ… అభివృద్ధి తక్కువ… అన్న చందంగా మారిందని గచ్చిబౌలి డివిజన్ బిజెపి అభ్యర్థి వి. గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మధురానగర్ కాలనీలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గచ్చిబౌలి డివిజన్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీని గెలిపిస్తే గచ్చిబౌలి రూపురేఖలను సమూలంగా మారుస్తామని, అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని అని హామీ ఇచ్చారు.

గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనను ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి కార్యకర్తలు నరేంద్ర మోడీ మాస్కులతో కాలనీలు, బస్తీలలో సంచరిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.