
శేరిలింగంపల్లి : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారి అనుకోని ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైంది. తన ఇంటి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను అనుకోకుండా పట్టుకొని తీవ్ర గాయాలపాలైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి బంజారా బస్తీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… గచ్చిబౌలి బంజారా నగర్ బస్తీలో నివాసముండే రమణ, ఆదిలక్ష్మి ల కుమార్తె ఏడేళ్ల భవ్య శ్రీ శుక్రవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ జంపర్ వైర్లను పట్టుకుంది. ఈ ప్రమాదంలో విద్యుత్ ఘాతానికి గురైన భవ్య శ్రీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
