
హైదరాబాద్, నిఘా24: హైదరాబాద్ ఐటీ కారిడార్ లంబోధరుడి లడ్డు రికార్డు సృష్టించింది. గచ్చిబౌలిలోని మై హోం భూజలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డు వేలం పాటలో 18.50 లక్షల ధర పలికింది. గచ్చిబౌలి బయో డైవర్స్ సిటీకి అనుకొని ఉన్న మై హోమ్ భుజా లగ్జరీ అపార్ట్మెంట్ లో స్థానిక అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూర్తి ఏకో ఫ్రెండ్లీ గణనాథుడిని ప్రతిష్టించి ఆదివారం నిమజ్జనం నిర్వహించారు. అంతకుముందు లడ్డు వేలంపాట నిర్వహించగా, స్థానికంగా నివాసం ఉండే వ్యాపారవేత్త విజయ్ భాస్కర్ రెడ్డి గణనాథుడి లడ్డును 18లక్షల 50వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు.
మై హోమ్ భుజాలో మొదటిసారి నిర్వహించిన లడ్డూ వేలం ఎవరూ ఊహించని విధంగా భారీ ధర పలికి చరిత్ర సృష్టించడం విశేషం. మొత్తంగా బాలాపూర్ తరువాత రెండవ అత్యధిక ధర పలికిన లడ్డుగా మై హోం భూజ లడ్డు నిలిచింది. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన నగదును సమాజసేవకు ఖర్చు చేస్తామని మై హోం భూజ ప్రతినిధులు, లడ్డూ దక్కించుకున్న విజయ్ భాస్కర్ రెడ్డిలు తెలిపారు.