
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సోమవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా లు శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని రాయదుర్గం, ఖాజాగుడా, నానకరాంగూడా, గౌలిదొడ్డి, నల్లగండ్ల లో 3.12కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచి నీటి పైప్ లైన్ పనులకు వారు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీఅర్ఎస్ నాయకులు, స్థానికులు, చిత్రపురి కాలనీ నటులు, అధికారులు పాల్గొన్నారు.