
శేరిలింగంపల్లి, నిఘా 24 : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నిర్వహించిన సీతా రాముల కళ్యాణ మహోత్సవంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీతో కలిసి మాజీ కార్పొరేటర్ సాయిబాబా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నల్లగండ్లలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు సాయిబాబా ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.

అనంతరం వేడుకల నిర్వాహకులు సాయిబాబాను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రజలు, గచ్చిబౌలి డివిజన్ వాసులు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని కోరుకున్నట్లు సాయిబాబా తెలిపారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
