
శేరిలింగంపల్లి, నిఘా 24: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి రంగనాథ స్వామి గుట్టపై ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో గురువారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణం కనులవిందుగా నిర్వహించారు.

గోపన్ పల్లితో పాటు నల్లగండ్ల నవోదయ కాలనీ, మంజీరా డైమండ్ హైట్స్, హానర్ హోమ్స్, గోపనపల్లి తండాలలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. వేడుకల్లో పలు కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో గంగాధర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలు, ఆదర్శవంత కుటుంబ జీవనానికి శ్రీరామ చంద్రుడి జీవతం అద్దం పడుతుందన్నారు. శ్రీరామనవమి ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి, నవోదయ కాలనీ, హానర్ హోమ్స్, మంజీరా డైమండ్ హైట్స్ కాలనీ వాసులు, భక్తులు, బీజేపీ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
