
శేరిలింగంపల్లి, నిఘా 24 : వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణనాథులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా గోపన్ పల్లిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు.

గోపన్ పల్లి, తండా, ఎన్టీఆర్ నగర్ లలో స్థానిక సంక్షేమ సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడి కరుణా, కటాక్షాలు డివిజన్ ప్రజలపై ఉండాలని, డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.

అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను ప్రజలంతా కలిసిమెలిసి, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
