
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఇంద్రానగర్‌లో బాంబు కలకలం రేగింది. హోటల్ వద్ద బాక్సును గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లాడు. బాక్స్‌ను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబ్ స్వాడ్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. బాక్సులో బల్బులు మాత్రమే ఉండటంతో ప్రమాదం లేదని తేల్చిన పోలీసులు బాక్స్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

