
హైదరాబాద్, నిఘా24 : గచ్చిబౌలి హెచ్ సీయూ రోడ్డుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి వైపు నుంచి లింగంపల్లి వైపు వస్తున్న కారు వేగంగా దూసుకువచ్చి అడుపుతప్పింది. రహదారి మధ్యలో ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గచ్చిబౌలి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని జూనియర్ ఆర్టిస్టులు ఎం.మానస, ఎన్.మానసగా గుర్తించారు. మరొకరు కారు నడుపుతున్న బ్యాంక్ ఉద్యోగి అబ్దుల్లా ప్రమాదంలో మృతి చెందాడు. కారులో ఉన్న సిద్దు అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.