
గచ్చిబౌలి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ అంజయ్య నగర్ లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆంజయ్య నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సాయిబాబా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఫలహారం బండీ ఊరేగింపులో స్థానికులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అంజయ్య నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంజయ్య నగర్ స్థానికులతో పాటు యూత్ అసోసియేషన్ సభ్యులు, గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
