
శేరిలింగంపల్లి, నిఘా 24: మంచి తరుణం.. మించినా దొరకదు… కంటికి కనిపించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేయ్… అన్నట్టుగా ఉంది శేరిలింగంపల్లిలో పరిస్థితి. నాయకులు, ప్రజలు ఎన్నికల గందరగోళంలో ఉండగా, అధికారులు ఎన్నికల విధుల పేరుతో కళ్లు ముసుకున్నట్టు నటిస్తుండగా, కబ్జాదారులు మాత్రం అడ్డు, అదుపు లేకుండా కనిపించిన ప్రభుత్వ స్థలాన్ని కనిపించినట్టు అక్రమిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జోష్ ఓ వైపు పతాక స్థాయికి చేరుతుండగా… మరోవైపు అక్రమార్కుల కబ్జాలు శేరిలింగంపల్లిలో ఊపందుకున్నాయి. శేరిలింగంపల్లి పరిధిలో ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పర్వం కొనసాగుతుంది. కబ్జాలను అడ్డుకోవలసిన అధికారులు మొత్తం కొత్తవారు కావడం, ఉన్న పాత అధికారులు ఎన్నికల విధుల పేరుతో కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తుండడంతో, శేరిలింగంపల్లిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే పరాధీనం అవుతున్నాయి. ప్రభుత్వ స్థలాల కబ్జాల మీద అధికారులకు స్థానికుల నుంచి పిర్యాదులు అందుతున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ శేరిలింగంపల్లిలో కొనసాగుతున్న ప్రభుత్వ స్థలాల కబ్జా బాగోతాలను నిఘా24 మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

1) గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వెనుక గోపన్ పల్లి సర్వే నెంబర్ 74లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు వాటాలు వేసుకొని అక్రమిస్తున్నారు. గత సంవత్సరం క్రితం ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాలను నాటి రెవెన్యూ అధికారులు కూల్చివేయగా, నేడు అవే భూముల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి.

2) ఖాజాగూడలోని చిత్రపురి కాలనీకి వెళ్లే దారిలో, సర్వే నెంబర్ 40లో ఉన్న దాదాపు 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఓ కబ్జాదారుడు నకిలీ డాక్యుమెంట్లతో కబళిస్తున్నాడు. బహిరంగ మార్కెట్ లో ఈ భూమి విలువ దాదాపు 20కోట్ల వరకు ఉండడం గమనార్హం. ఎన్నో రోజులుగా కబ్జాదారుడు ఈ స్థలం మీద కన్నేయగా, గతంలో అధికారులు అడ్డుకొని, ప్రభుత్వ స్థలం బోర్డులు పాతి కాపాడారు. ప్రస్తుతం కబ్జాదారుడి వెనుక ఓ అధికార పార్టీ నాయకుడు ఉండడంతో అధికారులు సైతం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
3) గచ్చిబౌలి టెలికాం నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 91లో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గతంలో రెవెన్యూ అధికారులు సదరు స్థలాల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి, ప్రభుత్వ బోర్డులు పాతి రక్షించారు. కానీ నేటి పరిస్థితులు, అధికారుల అండదండలతో కబ్జాదారులు ఏకంగా బహుళ అంతస్థుల నిర్మాణ పనులు ప్రారంభించారు.

4) ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న లేక్ రోడ్డుకు అనుకొని, సర్వే నెంబర్ 28లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కబ్జాదారులు తాత్కాలిక నిర్మాణాలతో వాణిజ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నెలరోజుల క్రితం ఈ కబ్జాలను తొలగించేందుకు వెళ్లిన అధికారులను కబ్జాదారులు అడ్డుకోవడంతో, రెవెన్యూ సిబ్బంది తిరుగుముఖం పట్టడం గమనార్హం.

5) రాయదుర్గం సర్వే నెంబర్ 5/3లో ఉన్న నంది హిల్స్ లో ప్రభుత్వ స్థలాలు, కోర్టు వివాదాస్పద భూముల్లో భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు తిరిగి కొనసాగుతున్నాయి. గత రెండు నెలల క్రితం అధికారులు ఈ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసి, పనులను నిలిపివేయించారు. రెవెన్యూ అధికారులతో జరిగిన సెటిల్మెంట్ కారణంగానే ఈ నిర్మాణాల మీద అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

6) ఖాజాగూడ సర్వే నెంబర్ 27లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చదును చేసిన ఓ అధికార పార్టీ నాయకుడు, అందులో బేస్ మెంట్ నిర్మాణం చేపట్టి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో సైతం సదరు నాయకుడు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు నిర్మాణాలు చేపట్టగా, నాటి అధికారులు అడ్డుకొని, ప్రభుత్వ స్థలాన్ని రక్షించారు.
👍
Are you creating a FiveM server? Here are the best scripts for FiveM, for a cheap price and a very good quality! Don’t waste your time for testing and fixing free FiveM scripts. Use our premium FiveM scripts.
FiveM Store
chandanagar also same situation
Contenido interesante. Gracias por compartir este tipo de publicación valiosa.
Dear immortals, I need some wow gold inspiration to create.