
హైదరాబాద్ : గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులతో కూడిన ఎకో నేచర్ ఆర్గానిక్ స్టోర్ ను సోమవారం ప్రారంభించారు. ఐటీ కారిడార్ టిఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ను తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రావు హాజరై ప్రారంభించారు. ఎరువులు, పెస్టిసైడ్స్ తో ఆహారపు ఉత్పత్తులు కలుషితమవుతున్నాయని, సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సేంద్రీయ కూరగాయలు, ఆహార ఉత్పత్తులు స్టోర్ లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. స్టోర్ ఓనర్ రామి రెడ్డి, మేనేజర్ హరిరెడ్డిలు పాల్గొన్నారు.
