
శేరిలింగంపల్లి, నిఘా24 : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకున్ని ప్రతిష్టించి పూజించాలని హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు. హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో శుక్రవారం తారానగర్ లోని సన్ షైన్ స్కూల్ లో విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను పంపీణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతుగా గత 7 సంవత్సరాలుగా హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో మట్టి వినాయకులని పంపీణీ చేస్తున్నామని కొండా విజయ్ కుమార్ తెలిపారు.

ఇదే క్రమంలో ఈ సంవత్సరం తమ ఫౌండేషన్ ఆద్వర్యంలో 5 వేల మట్టి వినాయకుల ప్రతిమలను పంపీణీ చేయనున్నట్లు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు . వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాధిక, సిబ్బంది వాణీ, ఇషా , చిన్మయ్, సరిత తదితరులు పాల్గొన్నారు .