
హైదరాబాద్: ఖరీదైన కారు.. మద్యం మత్తులో డ్రైవర్.. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ ను తప్పించుకునేందుకు రాంగ్ రూట్ లో దూసుకువచ్చిన ఓ కారు బైక్ ను ఢీ కొట్టడంతో హైటెక్ సిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అభిషేక్ ఆనంద్ మృతి చెందగా, వెనుక కూర్చున్న మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి లిసాదర్ చౌదరికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అశ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.