
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి కోర్టు 6నెలల జైలు శిక్ష, 1 ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ శిక్ష పడింది. నేపాల్ కు చెందిన ధన్ బహదూర్ బండెలా(25) ఆర్ సీ. పురంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. లింగంపల్లి జంక్షన్ వద్ద మియపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ధన్ బహదూర్ పలుమార్లు పట్టుబడ్డాడు. దీంతో కూకట్ పల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోమవారం ధన్ బహదూర్ కు 6నెలల జైలు శిక్ష, 1 సంవత్సరం డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తూ శిక్ష విధించారు.