
హైదరాబాద్, నిఘా24 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇప్పిసానని చెప్పి మోసాలకు పాల్పడిన ముగ్గురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు.89 మంది అమాయక ప్రజలను మోసం చేసి కోటి రూపాయలు కాజేసిన సూరారం కు చెందిన వరప్రసాద్
బహదూర్ పల్లి లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను అలాట్ మెంట్ చేయిస్తానని మోసం చేసిన వరప్రసాద్ ముఠా. ఒక్కోక్కరి నుండి లక్షా 20 వేల నుంచి లక్షా 70 వేల వరకు వసూలు చేసిన ముఠా.వరప్రసాద్ పై గతంలోను డబుల్ బెడ్ రూం చీటింగ్ కేసు నమోదైంది.