
హైదరాబాద్ : చందనగర్ లోని పిజెఅర్ స్టేడియంలో ఈ నెల 24న రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అద్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం చందనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ లు వివరాలు తెలిపారు. అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు 35 నుండి 80 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని తెలిపారు. రన్నింగ్, జంపింగ్, త్రోబాల్, వాకింగ్, హార్డిల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కోన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామన్నారు. ఆసక్తి గలవారు 93948 68993 నెంబరులో సంప్రదించాలని సూచించారు.