
హైదరాబాద్ : కరోనా లాక్ డౌన్ వేళ వాహనాలు లేక బోసిపోయిన రహదారులపై వన్యప్రాణుల గుంపులు సందడి చేస్తున్నాయి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. కాంక్రీట్ జంగిల్ గా పిలిచే ఐటీ కారిడార్ పరిధిలోని పరిస్థితి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని గౌలిదొడ్డి పెట్రోల్ బంక్ వద్ద రాత్రి జింకల గుంపు కనిపించింది. లాక్ డౌన్ కారణంగా వాహనాల చప్పుడు లేక, మూతపడిన పెట్రోల్ బంకులో జింకల గుంపు వచ్చి చేరింది. అటుగా కారులో వెళ్తున్న వాహనదారులు జింకల గుంపును చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి అనుకొని ఉన్న ఈ ప్రాంతంలో తరచు జింకలు కనిపించడం సాధారణమే ఐనా, ఒకేసారి 7,8 జింకల మంద కనిపించడం ఆశ్చర్యకరం. కరోనా కరాలనృత్యంతో, లాక్ డౌన్ తో ప్రజలు, వాహనాలు రహదారుల మీద కనిపించకపోవడంతో వన్యప్రాణులు హైటెక్ సిటీలో సైతం స్వేచ్ఛగా విహరిస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
3 Comments