
హైదరాబాద్, నిఘా24: సైబరాబాద్ కమిషనరేట్ కొత్త కొత్వాల్ గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజిపిగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ కమిషనర్ గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కమిషనర్ సిపి.సజ్జనార్ ను తెలంగాణ ఆర్టీసీ ఎండిగా బదిలీ చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా మూడేళ్ల పైచిలుకు పనిచేసిన సజ్జనార్ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రజా భద్రత కోసం ఎన్నో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, పోలీసు వ్యవస్థ అంటే భద్రత మాత్రమే కాదు.. ప్రజాసేవ అనేలా సజ్జనార్ సైబరాబాద్ లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ తో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది.
