
సైబరాబాద్, నిఘా 24: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా జి.సురేష్ నియమితులయ్యారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్ పెక్టర్ లను బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ విసి. సజ్జనార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు ఇనిస్పెక్టర్లను బదిలీ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ను సిటిసికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో రాజేంద్రనగర్లో పనిచేస్తున్న జి. సురేష్ ను నియమించారు. వీరితో పాటు మరో 4గురు ఇనిస్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
