
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ఎట్టకేలకు పోలీసుల ముందుకు వచ్చాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. మంగళవారం సాయంత్రం హాజరైన రవి ప్రకాష్ ను రెండు కేసులు పై విచారణ చేసిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసుల విచారణకి హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపధ్యంలో తప్పని పరిస్థితుల్లో రవి ప్రకాష్ పోలీసుల ముందుకు వచ్చారు.