
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని వదలడం లేదు. తాజాగా కొండాపూర్ లోని జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ వ్యాధి బారిన పడ్డాడు. గతకొన్ని రోజులుగా కొండాపూర్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నిర్వహణ బాధ్యతల్లో సూపరెండేంట్ చురుగ్గా పాల్గొన్నాడు. గత రెండు రోజులుగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్ కు వెళ్లిన సూపరెండేంట్ కు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కొండాపూర్ జిల్లా ఆసుపత్రి సూపరెండేంట్ కోవిడ్ బారిన పడడంతో స్థానికంగా కలకలం రేపింది.
2 Comments