
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగుడా స్మశాన వాటికను అతి త్వరలో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు డివిజన్ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా తెలిపారు. శనివారం అధికారులు, స్థానికులతో కలిసి స్మశానవాటికను పరిశీలించిన కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ ఖాజాగుడ స్మశానవాటికలో నెలకొన్న సమస్యలపై స్థానికులు విన్నవించారని, స్ట్రీట్ లైట్స్,బొర్ వెల్, పెయింటింగ్, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించాలని కొరారన్నారు. స్మశానవాటికలో సదుపాయాల కోసం త్వరలో శంకుస్థాపన కోసం చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు నరసింగరావు, పురుషోత్తం,సుధ,శేఖర్ నాయకులు నారాయణ,నరేష్ సింగ్, నగేష్ అధికారులు కనకయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.