
శేరిలింగంపల్లి : హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గెజిటడ్ ఆఫీసర్స్ కాలనీలో శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ లు పర్యటించారు. స్థానికంగా చేపడుతున్న నాలా పూడికతీత పనులను, నూతనంగా నిర్మించాల్సిన రోడ్డు పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా పూడికతీత పనులను వేగవంతం చేయాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ చిన్నారెడ్డి, ఏఈ అలీం, జయరాజ్ యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.